» తెలుగు » సినిమా » వార్తలు హాట్ టాపిక్ : 'సీతమ్మ వాకిట్లో...' మీద కొత్త డౌట్స్ Posted by: kramakrishna  వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శక,నిర్మాతలు మీడియా ముఖంగా గతంలోనే తెలియచేసారు. అయితే సంక్రాంతికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రానికి ఇంకా ప్రమోషన్ ప్రారంభం కాలేదు. మరో ప్రక్క రీ రికార్డింగ్, డిటిఎస్ మిక్సింగ్, డిఐ వంటి పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం అనుకున్న టైమ్ కు విడుదల చేస్తారా..చేయరా అనే సందేహాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. అంతేగాక ఈ చిత్రం వాయిదా పడే అవకాసముందని వార్తలు కూడా మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయమై దిల్ రాజు ప్రకటన చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. mahesh babu svsc dubbing stage సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | మహేష్ బాబు కొత్త బంగారు లోకం చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు. అలాగే ...''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు. ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'...అలాగే మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి