Sunday, January 6th, 2013 | Home |ePaper |ePaper-Help|About Us | Archives | Contact Us | Tariff | Esubscription-FAQs |
హైదరాబాద్, జనవరి5: రాష్ట్రంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి 'వార్షికాదాయ అవసరాల' (ఏఆర్ఆర్) ప్రతిపాదనలను నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) శనివారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ మేరకు డిస్కంల ప్రతిపాదనలకు సీఎం కిరణ్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈఆర్‌సీ బహిరంగ విచారణ అనంతరం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి.
జనవరి5 (ఆంధ్రజ్యోతి): 'గూర్ఖాల్యాండ్ సమస్యకు సాహసోపేతమైన పరిష్కారాన్ని కనుగొనగలిగాం. ఇదే విధంగా తెలంగాణ సమస్యను కూడా పరిష్కరిస్తామనే నమ్మకం ఉంది'... గతనెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి షిండే చేసిన ప్రకటన ఇది! ఆయన గూర్ఖాల్యాండ్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు?...
న్యూఢిల్లీ, జనవరి 5: "కొవ్వొత్తుల ప్రదర్శనలతో మనుషుల వైఖరిని మార్చలేరు. రోడ్ల పక్కన సహాయం కోసం ఎదురు చూసే వారిని ఆదుకోండి! ఆ రోజు ఒక్కరు మా మొర ఆలకించి ఉన్నా... పరిస్థితి భిన్నంగా ఉండేది''... ఇది ఢిల్లీ అత్యాచార ఘటనలో దుండగుల చేతిలో దెబ్బలు తిన్న నిర్భయ స్నేహితుడు చెప్పిన మాట!..
తాండూరు, జనవరి 5: అక్బరుద్దీన్ ఒవైసీపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరమే లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. 'చట్టాన్ని గౌరవిస్తాం. అక్బరుద్దీన్ లొంగిపోతాడు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని కోర్టులో నిరూపిస్తాం' అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాండూరులో నిర్వహించిన ముస్లిం ఐక్య వేదిక సభలో ఆయన ప్రసంగించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి