obma agin wins second time president usa

ఎమ్మెల్యేగానే పోటిచేస్తా: బాలకృష్ణ

Publish Date:Nov 23, 2012


 balakrishna TDP, balakrishna loksabha,  balakrishna 2014 elections, TDP balakrishna loksabha

ప్రముఖ నటుడు, న౦దమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్ సభకు పోటి చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలోచ్చాయి. ఈ వార్తలను బాలకృష్ణ ఖండించారు. తాను ఎంపీగా పోటి చేయనని, ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో పోటి చేస్తానని ప్రకటించారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. టిడిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళే వారంతా అవకాశవదులేనని అన్నారు. కొంత మంది వాళ్ళ స్వార్ధం కోసమే ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారని...వారితో టిడిపికి నష్టం లేదని పేర్కొన్నారు.

ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని, పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా ఫరవా లేదని, పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు.

బాలకృష్ణ కు లోకసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగానే వున్నారని ఈ మధ్య టాక్ వచ్చింది. లోకసభ ఎన్నికల్లో కాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో కాలు మోపేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి