ఏడోసారి రోదసిలో నడిచిన సునీతా విలియమ్స్ అత్యధిక స్పేస్‌వాక్‌లు చేసిన మహిళగా రికార్డు
హూస్టన్: భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తన రికార్డును తానే అధిగమించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి గురువారం ఏడోసారి స్పేస్‌వాక్ చేసి రోదసిలో అత్యధికసార్లు నడిచిన మహిళగా రికార్డు కొనసాగించారు. ఇంతవర కూ సునీత ఆరు సార్లు మొత్తం 44 గంటలపాటు రోదసిలో నడిచారు. ఐఎస్‌ఎస్‌కు చెందిన రేడియేటర్ వ్యవస్థలో ఏర్పడిన అమ్మోనియం లీకేజీని గుర్తించేందుకు ఆమె సహచర వ్యోమగామి అకీ హొషిడేతో కలిసి గురువారం ఐఎస్‌ఎస్ నుంచి వెలుపలికి వచ్చారు. ఆరున్నర గంటలపాటు సాగిన మరమ్మతులో.. ఐఎస్‌ఎస్ పీ6 భాగం నుంచి ఫొటోవోల్టాయిక్ రేడియేటర్‌ను వేరు చేసి అమ్మోనియా ప్రవాహాన్ని ఆపేయడం, మరో రేడియేటర్ ద్వారా అమ్మోనియా ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టినట్లు ఈ మేరకు నాసా వెల్లడించింది. కాగా, సురక్షితమైన మార్గం కోసం ఐఎస్‌ఎస్‌ను కొంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు బుధవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి