అమెరికా చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నికలు

11/2/2012 1:20:00 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలోనే అతి ఖరీదైనవిగా రికార్డు సృష్టించబోతున్నాయి. ఈ ఎన్నికలకు కళ్లు చెదిరే రీతిలో 6వేల కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చవుతోంది. భారతీయ కరెన్సీలో ఇది రూ. 32,310 కోట్ల పైచిలుకు అవుతుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న ఖర్చే రూ.13 వేల కోట్లకు పైమాటగా ఉంది. 2008వ సంవత్సరంలో రూ.3,789కోట్లుగా ఉన్న ఈ ఖర్చు ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరిగింది. వాషింగ్టన్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ (సీఆర్పీ)’ అధ్యయన సంస్థ ఈ వివరాలు తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి