ఒబామా ఓదార్పు న్యూజెర్సీలో ఏరియల్ సర్వే


11/2/2012 1:16:00 AM
న్యూజెర్సీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూజెర్సీ తీర ప్రాంతాల్లో పర్యటించి తుపాను బాధితులను ఓదార్చారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. న్యూజెర్సీలోని బ్రిగాంటైన్ బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో బాధితులను ఒబామా పరామర్శించారు. సహాయకార్యక్రమాలు సక్రమంగా అమలు కావడానికి న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఎనలేని కృషి చేస్తున్నారని ఒబామా ప్రశంసించా రు. న్యూజెర్సీలోని తీర ప్రాంతాల్లో ఆయ న హెలికాప్టర్లో పర్యటించి శాండీ సష్టించి న పెను విలయాన్ని వీక్షించారు. తుపాను వల్ల నేలమట్టమయిన నగరాలను పునర్నిర్మించడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని బాధితులకు హామీ ఇచ్చారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఇళ్లకు, వ్యాపారాలకు వెంటనే విద్యుత్ సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి జరుగుతున్నట్లు చెప్పారు.‘మేం ఉన్నది మీ కోసమే.. మీరు ఇళ్లు పునర్నిర్మించుకోవడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తాం’ అని ఒబామా హామీ ఇచ్చారు. రోమ్నీ మద్దతుదారైన న్యూజెర్సీ గవర్నర్ క్రిస్టీ.. ఒబామాకు బద్ధ వ్యతిరేకిగా గుర్తింపు పొందారు. వీలు చిక్కినప్పుడల్లా ఒబామాపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తుంటారు. శాండీ తుపాను వీరిద్దరినీ ఒక్కదగ్గరకు చేర్చింది. రాజకీయ శత్రుత్వాలను పక్కనపెట్టిన ఒబామా క్రిస్టీతో కలిసి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి