విశ్వరూపం' థియేటర్లకు రక్షణ కల్పించండి: కమల్‌హాసన్
చెన్నై, జనవరి6, (ఆంధ్రజ్యోతి): 'విశ్వరూపం' చిత్రాన్ని డీటీహెచ్‌లో
విడుదల చేసిన పక్షంలో థియేటర్లలో ప్రదర్శించేది లేదంటూ తమిళనాడు థియేటర్
యజమానుల సంఘం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది యజమానులు
'విశ్వరూపం' ప్రదర్శించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో, ఆ థియేటర్లకు
రక్షణ కల్పించాలని కోరుతూ నటుడు కమల్‌హాసన్ పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన ఆదివారం తమిళనాడు ఏడీజీపీ రాజేంద్రన్, హోం కార్యదర్శి
ఆర్.రాజగోపాల్‌లను కలిసి వినతి పత్రం సమర్పించారు.
చెన్నైలో దేవి సినీప్లెక్స్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 300 థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఆయా థియేటర్ల యజమానులు ముందుకొచ్చారు. ఆ థియేటర్లలో ప్రదర్శనను కూడా అడ్డుకుంటామని హెచ్చరికలు వస్తుండడంతో కమల్ పోలీసు సాయం కోరారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, సినిమా రంగంలో డీటీహెచ్ కొత్త వ్యాపార సూత్రంగా పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, డీటీహెచ్‌లో 'విశ్వరూపం' ప్రదర్శించే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయిస్తామంటూ బెదిరిస్తున్నారని, సినిమాని పైరసీ చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో'విశ్వరూపం' విడుదల చేయబోయే థియేటర్లలో సమస్యలు సృష్టించకుండా పోలీసు భద్రత కోరినట్లు కమల్‌హాసన్ చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి