హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల ఎదుట లొంగిపోయే
వ్యవహారం ఇంకా ఏమీ తేలలేదు. ఆయన తరపున నిర్మల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన
హైకోర్టు న్యాయవాదులు మహ్మద్ ఇస్మాయిల్, రసూల్ ఖాన్ లు ఒక నోట్
సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన రాలేకపోయారని అందులో తెలిపారు.
రేపు నిజామాబాద్ పోలీస్ స్టేషన్ కు హాజరవుతారని తెలిపారు. ఎల్లుండి నిర్మల్
పోలీస్ స్టేషన్ కు హాజరవుతారని న్యాయవాదులు పోలీసులకు చెప్పారు. అయితే
నిర్మల్ పోలీసులు అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో
అక్బరుద్దీన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని
భావిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి