హైదరాబాద్ : రాజ్యాంగ
విలువలకు భంగం కలిగిస్తే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం
స్పీకర్ కు ఉందని శాసనసభ నైతిక విలువల కమిటీ స్పష్టం చేసింది.
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ
సీరియస్‌గా తీసుకుంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో
సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు.
అక్బర్‌పై చర్యలు
తీసుకోవాల్సిందేనని సీపీఐ సభ్యుడు వాదించారు. కమిటీకున్న అధికారాల పరిధిపై
స్పష్టత ఇవ్వాలని సమావేశానంతరం స్పీకర్‌ను ఎథిక్స్ కమిటీ ఛైర్మన్
బండారు సత్యానందరావు కోరారు. ప్రసంగాలు పరిశీలించి అక్బర్‌పై
తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలు సిఫారసు చేస్తామని కమిటీ ఛైర్మన్
తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి