హైదరాబాద్‌లో అక్బరుద్దీన్
విమానాశ్రయం వద్ద పార్టీ ఎమ్మెల్యేల స్వాగతం
నగరంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
అనారోగ్యంతో బాధపడుతున్నానన్న అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, జనవరి 7 : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివిధ కేసుల్లో ఇరుక్కున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లండన్ నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన వస్తున్నట్లు సమాచారం అందుకున్న కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. లండన్ నుంచి కతర్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న అక్బరుద్దీన్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బంజరాహిల్స్‌లోని ఆయన నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్వరుద్దీన్ జీన్స్ ప్యాంటు, టీషర్టులో లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

మరోవైపు అక్బరుద్దీన్‌పై ఉన్న కేసుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మల్, నిజామాబాద్, ఓయూ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యారు. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌లో పీఎస్‌లోనూ ఆయనపై పలుపురు ఫిర్యాదు చేశారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ చుట్టూ రాపిడ్‌యాక్షన్ ఫోర్స్ మోహరించాయి. ముందస్తుగా 30 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

లండన్ నుంచి వచ్చిన అక్బరుద్దీన్ తాను అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైసీ ఆస్పత్రి వైద్య బృందం అక్బరుద్దీన్ నివాసానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి