రేపిస్టులందరూ బీహారీలే: రాజ్ ఠాక్రే
ముంబై/పాట్నా, జనవరి 7: మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్
ఠాక్రే మరోసారి నోటికి పనిచెప్పారు. ఢిల్లీ అత్యాచారం బీహారీ వలస వ్యక్తుల
దుండగమేనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి గోరేగావ్‌లో జరిగిన ఓ
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "గ్యాంగ్‌రేప్ గురించి అందరూ
మాట్లాడుతున్నారు. కానీ, ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడినుంచి
వచ్చారని మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదు.
రేపిస్టులంతా బీహార్ నుంచి వచ్చినవారేనన్న వాస్తవం గురించి నోరెత్తేవారే లేరు. వారివల్లే రేప్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అసలీ వ్యవస్థే కుప్పకూలిపోయింది'' అని ఆరోపణలు గుప్పించారు. బీహార్‌లో మాత్రమే చేసుకునే ఛాత్ పూజను ముంబైలో నిర్వహించడం వారి సంఖ్యాబలాన్ని చూపేందుకు మాత్రమేనని తేల్చేశారు. అయితే, దీనిపై ఆదివారం పాట్నాలో జేడీయూ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ మండిపడ్డారు.
బీహారీలను ఆడిపోసుకోవడాన్ని రాజ్ ఒక అలవాటుగా మార్చుకున్నాడని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దుయ్యబట్టారు. "కొందరు ఈ దేశాన్ని భారత్-ఇండియా, మహారాష్ట్ర-బీహార్ అంటూ విభజిస్తున్నారు. ఇది మన జాతికి, ప్రజాస్వామ్యానికి హానికరం'' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు. జాతిని చీల్చే వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి