ఇంటర్‌నెట్ వల్ల ఏటా 83 కోట్ల టన్నుల సీవోటూ

ఇంటర్‌నెట్ వల్ల ఏటా 83 కోట్ల టన్నుల సీవోటూ
1/7/2013 
మెల్‌బోర్న్: ఇంటర్‌నెట్‌తో సహా సమాచార, సాంకేతిక రంగానికి చెందిన ఇతర వ్యవస్థలు, పరికరాల కారణంగా ఏటా 83 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవోటూ) వాతావరణంలోకి విడుదలవుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సమాచార, సాంకేతికత వల్ల వచ్చే 2020 నాటికి గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం దాదాపు రెట్టింపు కానుందని తేలింది. ‘సెంటర్ ఫర్ ఎనర్జీ-ఎఫిషియెంట్ టెలీకమ్యూనికేషన్స్ (సీట్)’, బెల్ ల్యాబ్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ముప్పు మరింత పెరగకుండా నివారించాలంటే.. ఇంటర్‌నెట్ సంబంధిత పరికరాలు ఇంధనాన్ని తక్కువగా వినియోగించుకునే లా, భూతాపోన్నతికి కారణమయ్యే సీవోటూ వంటి ప్రధాన గ్రీన్‌హౌజ్ వాయువులను తక్కువగా విడుదలచేసేలా కొత్త మోడల్స్‌ను రూపొందించాలని పరిశోధకులు సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి