సెక్స్ స్కామ్ లో దొరికిపోయిన సినీ, టీవీ ఆర్టిస్టు కిన్నెర

 Posted by: ramakrishna Published: Sunday, January7 Kinnera Exposed A Sting Operation హైదరాబాద్ నుంచి హాంగ్కాంగ్కు నాన్ స్టాప్ ఫ్లయిట్ హైదరాబాద్ : చెట్టు క్రింద ప్లీడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి, టీవీ సీరియల్స్ లో ఒక వెలుగు వెలిగిన కిన్నెర నిన్న శనివారం టీవీ 9 ఛానెల్ చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది. సినిమా ఛాన్సులు కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలు,ఫైనాన్సియర్స్ కు ఎర వేసి డబ్బు సంపాదించటంలో ఆరి తేరిందని రుజువైంది. తమకు వేషాలు ఇప్పించాల ని టీవీ 9 రిపోర్టర్ ఈ నటి దగ్గరకు వెళ్లగా...కిన్నెర,ఆమె భర్త కలిసి...అసలు విషయం తెలియక తాము చేస్తున్న చీకటి వ్యాపారం గురించి బట్టబయిలు చేసుకున్నారు. సినిమాల్లో అవకాసం రావాలంటే మేం చెప్పినట్లు వింటే చాలు అని నమ్మబలికారు. అంతేగాక ఓ ప్రముఖ సినీ ఫైనాన్సియర్ గెస్ట్ హౌస్ కి కిన్నెర ఆ మహిళ రిపోర్టర్స్ ని ఇద్దరిని తీసుకు వెళ్లే తార్చే ప్రయత్నం చేసింది. అప్పటికే అక్కడకి ఓ సినీ దర్సకుడు కూడా చేరుకున్నాడు. అయితే అనుకోని విధంగా..తాము రిపోర్టర్లమని చెప్పేసరికి..ఖంగుతిన్న ఆ దర్శక,నిర్మాతలు వేగంగా గోడ దూకి పారిపోయారు. ఇక కిన్నెరకి, టీవీ నైన్ రిపోర్టులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది... కిన్నెర ఇలా డ్రస్ వేసుకుంటే పనికాదు..టైట్ జీన్స్ వేసుకోవాలి. టైట్ టీ షర్ట్ వేసుకోవాలి. అందాలను ఎంత మంచిగా చూపిస్తే అంత మంచిగా అవకాశాలు వస్తాయి నువ్వు ఫిగర్ మెయింటైన్ చెయ్యి..ఎప్పుడూ ఫిగర్ స్లిమ్ గా మెయింటైన్ చేస్తే అందరూ పిలుస్తారు. దీనికి తోడు అందరితో కలిసిమెలిసి పోవాలి. పెద్ద పెద్ద దర్సకులు,నిర్మాతలు ఉంటాడుర. వారు చెప్పినట్లు వినాలి..ఎదగాలి పైకి రావాలంటే చాలా కష్టపడాలి.. కాలేజీకి వెళ్లి వస్తూండు. కాకపోతే ముఖానికి చున్నీ అడ్డం కట్టుకో.. మా ఇంటికి వచ్చి ఉండు. కావాలంటే వారం,రెండు వారాలు మా ఇంట్లోనే ఉండు. నేను చెప్పినట్లు విను. నిన్ను పెద్ద పెద్ద డైరక్టర్స్ దగ్గరకి పంపిస్తాను. ఆయన వేషం గురించి చూసుకుంటారు. ఆయన చెప్పినట్లు వినాలి. ఇలా చాలా డైరక్ట్ గా కిన్నెర..వారిని ట్రాప్ చేయటానికి ప్రయత్నించింది. ఈ సంఘటన సిని వర్గాల్లో కలకలం రేపింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి