Cinema Buzz: ఈ వీకెండ్ సినిమా రిలీజ్ విశేషాలు
rknew. హైదరాబాద్: వీకెండ్ వచ్చిదంటే చాలు ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా
ఉంటుంది. వారాంతం కావడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది
నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ వీకెండ్‌లో
కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో అల్లరి నరేష్ ‘యముడికి
మొగుడు', శర్వానంద్ ‘కో అంటే కోటి', ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన
‘జీనియస్', జాకీ చాన్ నటించిన హాలీవుడ్ మూవీ ‘దొంగలకు దొంగ cz12' చిత్రాలు
ఉన్నాయి.
cinema buzz upcoming movie releas
యముడికి మొగుడు | కో అంటే కోటి
1. యముడికి మొగుడు
అల్లరి నరేష్ హీరోగా యమలోకం బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చిత్రం ‘యముడికి
మొగుడు'. కామెడీ నేపథ్యంలో సాగే ఈచిత్రం డిసెంబర్ 27న గ్రాండ్‌గా
విడుదలవుతోంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ
అయింది. అల్లరి నరేష్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో ఉంటాయని
అంటున్నారు. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని చంటి అడ్డాల
నిర్మించారు.
2. కో అంటే కోటి
శర్వానంద్ హీరోగా రూపొందిన ‘కో అంటే కోటి' చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది.
శర్వా ఆర్ట్స్ బ్యానర్‌పై అనీష్ కురివిల్ల దర్శకత్వంలో మైనేని వసుంధరదేవి ఈ
చిత్రాన్ని నిర్మించారు. శర్వానంద్ సరసన ప్రియాఆనంద్ హీరోయిన్‌గా
నటిస్తున్న ఈ సినిమాలో శ్రీహరి కీలకపాత్రలో నటించారు.
3. జీనియస్
బుల్లితెర రియాల్టీ డాన్స్ షో ‘ఆట' ద్వారా పాపులర్ అయిన
ఓంకార్......‘జీనియస్' చిత్రంతో దర్శుకుడి అవతారం ఎత్తారు. ఈ చిత్రానికి
ప్రముఖ కథారచయిత చిన్నికృష్ణ కథను అందించారు. ఈ జీనియస్ సినిమాలో హవీశ్,
అశ్విన్, సానుష, అభినయ ముఖ్యపాత్రలల్లో నటించారు. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్
సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఈచిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. విద్యార్థులు, రాజకీయాల నేపథ్యంలో
రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పవర్ ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్లతో
చర్చనీయాంశం అయింది.
4. దొంగలకు దొంగ
హాలీవుడ్ స్టార్ హీరో జాకీ చాన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం
‘'సీజెడ్ 12'. తెలుగులో ఈచిత్రాన్ని దొంగలకు దొంగ పేరుతో విడుదల
చేస్తున్నారు. 12ఏళ్ల తర్వాత జాకీచాన్ నటించి దర్శకత్వం వహించిన భారీ
చిత్రమిది. ఈ నెల 28న విడుదలవుతోంది. ప్రాణాలకు తెగించి డూప్ లేకుండా
జాకీచాన్ చేసిన ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
Strongly Agree
0
Agree
0
Don't Care
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి